LIC IPO| ఎల్ఐసీ ఐపీవో.. లీగల్ అడ్వైజర్ తదితర పోస్టులకు బిడ్లు ఆహ్వానం!
LIC IPO| ఐపీవో ద్వారా ఎల్ఐసీ పెట్టుబడుల సేకరణకు మరో అడుగు ముందుకు పడింది. ఐపీవో నిర్వహణకు లీగల్ అడ్వైజర్, బుకింగ్ రన్నింగ్ లీడ్....

న్యూఢిల్లీ: ఐపీవో ద్వారా ఎల్ఐసీ పెట్టుబడుల సేకరణకు మరో అడుగు ముందుకు పడింది. ఐపీవో నిర్వహణకు లీగల్ అడ్వైజర్, బుకింగ్ రన్నింగ్ లీడ్ మేనేజర్, రిజిస్ట్రార్, ప్రజల సమస్యలపై అడ్వర్టైజింగ్ సంస్థ కోసం అప్లికేషన్లను కేంద్రం గురువారం ఆహ్వానించింది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఈపీ)ని సీపీపీ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) తెలిపింది.
పైన పేర్కొన్న పోస్టుల కోసం ఈ నెల 15 నుంచి బిడ్లు దాఖలు చేయొచ్చు. వచ్చేనెల ఆరో తేదీ వరకు బిడ్లు వేయొచ్చు. వచ్చేనెల 9న బిడ్లను తెరుస్తారు. ఏ సంస్థ అయినా ఒకటి కంటే ఎక్కువ బిడ్ దాఖలు చేయొద్దని దీపం జారీ చేసిన సర్క్యులర్ తెలిపింది.
ఈ వారంలోనే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో ఎల్ఐసీ ఐపీవోకు వెళుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల కంటే ఇది పెద్దది. పాలసీ హోల్డర్లకు 10 శాతం షేర్లను ఐపీవోలో రిజర్వు చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

