ముంబై, జూన్ 19: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) తన వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 36వ వార్షికోత్సవం సందర్భంగా గృహ రుణాలు తీసుకునేవారికి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నెల 1 నుంచి 30 లోపు తీసుకునే గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం లేదని కంపెనీ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి తెలిపారు. 1989లో ప్రారంభమైన సంస్థ..ఇప్పటి వరకు 34 లక్షల మందికి రూ.3 లక్షల కోట్లకు పైగా గృహ రుణాలు మంజూరుచేసింది.