హైదరాబాద్, సెప్టెంబర్ 1: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా గురువారం 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. బుధవారంతో ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఏర్పడి 66 ఏండ్లు పూర్తయ్యింది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో 1956, సెప్టెంబర్ 1న మొదలైన ఎల్ఐసీ ఆస్తుల విలువ నేడు రూ.42,30,616 కోట్లుగా ఉన్నది. ఇక లైఫ్ ఫండ్ రూ.37,35,759 కోట్లుగా ఉండగా, మార్కెట్ వాటా 63.25 శాతం. గత ఆర్థిక సంవత్సరం 2.17 కోట్ల కొత్త పాలసీలను ఎల్ఐసీ విక్రయించింది. కాగా, 14 దేశాల్లో ఎల్ఐసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సంస్థకు లక్షకుపైగా ఉద్యోగులు, 13.26 లక్షలకుపైగా ఏజెంట్లు, 30 కోట్లపైనే పాలసీదారులున్నారు.