ఈ స్మార్ట్ ఫోన్ అతి చౌకగా వచ్చేస్తోంది. కేవలం 30వేలకే. ఇండియా రిలీజైనప్పుడు ఎల్జీ వింగ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.69,999. కానీ ఇప్పుడు ఆన్ లైన్లో ఇది కేవలం రూ.29,999 కే వచ్చేస్తోంది. వింగ్ స్పెషాల్టీ ఏంటంటే డ్యుయల్ డిస్ ప్లేతో వస్తుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీ-ఓఎల్ ఈడీ ఫుల్ విజన్ ప్యానెల్ ను ప్రధాన డిస్ ప్లేగా అందించగా, 3.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ జీ-ఓఎల్ ఈడీ ప్యానెల్ ను రెండో డిస్ప్లేగా అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత క్యూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 64 మెగా పిక్సెల్ రియర్, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే వీలుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ-ఏ, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
ఎల్జీ తన మొబైల్ డివిజన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ ఫోన్ ధర తగ్గింది. ఎల్జీ వింగ్‌కు సంవత్సరం వారంటీ.. ఐదు సంవత్సరాల సర్వీస్‌ను కంపెనీ అందించనుంది.