Lenovo Tab M10 5G | హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రానిక్ మేజర్ లెనెవో.. భారత్ మార్కెట్లోకి న్యూ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ‘లెనెవో టాబ్ ఎం19 5జీ’ ఆవిష్కరించింది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ రెండు రామ్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ అండ్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ సింగిల్ చార్జింగ్‌తో 12 గంటల వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇది 10.61-అంగుళాల డిస్ ప్లే విత్ 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పని చేస్తుంది.
లెనెవో టాబ్ ఎం10 5జీ టాబ్లెట్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకే లభిస్తుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర వెల్లడించలేదు. అబ్యాస్ బ్లూ కలర్ షేడ్ ఆప్షన్లో అందుబాటులో ఉంటది.
ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో శనివారం నుంచి కొనుగోలు చేయొచ్చు. లెవెనో అపిషియల్ వెబ్ సైట్, లెనెవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో లభిస్తుంది.
న్యూ లెనెవో టాబ్ ఎం10 5జీ.. 10.61-అంగుళాల ఎల్సీడీ (1200×2000) డిస్ ప్లే విత్ 400 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద పని చేస్తుంది.
8-మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా లభిస్తాయి. ఈ టాబ్లెట్ 7700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ మద్దతుతో వస్తున్నది. 12 గంటల వీడియో స్ట్రీమింగ్ తోపాటు 55 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైంకు సపోర్ట్ గా ఉంటది. డోల్బీ అట్మోస్ టెక్నాలజీతో డెవలప్ చేసిన డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తాయి. లెనెవో టాబ్ ఎం10 5జీ బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.