న్యూఢిల్లీ, జూన్ 19: ఐఐటీ కాన్పూర్‌తో లారస్ ల్యాబ్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నది. నావల్ జీన్ థెరపీ అసెట్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికే ఒప్పందం చేసుకున్నట్టు సోమవారం లారస్ తెలియజేసింది. ఇందులో భాగంగా ప్రీ-క్లినికల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ఉత్పత్తుల అడ్వాన్సింగ్ కోసం లారస్ ల్యాబ్స్ ఐఐటీ కాన్పూర్‌కు రిసెర్చ్ గ్రాంట్లను అందించనున్నది.