Lamborghini Huracan Tecnica | 3.2 సెకన్లలోనే 100 కిమీ స్పీడ్.. 25న భారత్‌లోకి లంబోర్ఘినీ హురకేన్ టెక్నికా
Lamborghini Huracan Tecnica | గురువారం భారత్ మార్కెట్లోకి వస్తున్న లంబోర్ఘినీ హురకేన్ టెక్నికా 3.2 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకుంటుంది.
Lamborghini Huracan Tecnica | లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని ఈ నెల 25న భారత మార్కెట్లోకి తాజా హురకేన్ టెక్నికాను విడుదల చేయనున్నది. దీని ధర రూ.4.50 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఎస్టీవో వర్షన్ కారు రూ.4.99 కోట్లు పలుకుతుందని అంచనా. పొర్షే 911 జీటీ3 కారుతో లంబోర్ఘినీ హురకేన్ టెక్నికా తల పడనున్నది.
సేల్స్‌లో ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్న హురకేన్ ఎవో, హురకేన్ ఎస్టీవో మధ్య హురకేన్ టెక్నికా చోటు దక్కించుకోనున్నదని సమాచారం. హురకేన్ టెక్నికా గరిష్ఠంగా గంటకు 325 కి.మీ. వేగంతో ప్రయాణించగలుగుతుంది. 3.2 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్, 9.1 సెకన్లలో 200 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్లనున్నది.
7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న లంబోర్ఘినీ హురకేన్ టెక్నికా 5.2 లీటర్ల వీ10 ఇంజిన్ కలిగి ఉంటుంది. 634 బీహెచ్పీ విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంది. హురకేన్ టెక్నికా కారు సియాన్ హైబ్రీడ్ హైపర్ కారు డిజైన్‌ను పోలి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robin Uthappa: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఊతప్ప
Women Prisoners Karwa Chauth | జైలులో మహిళా ఖైదీల కర్వా చౌత్.. ఫోన్లలో భర్త ఫొటోలు చూసి ఉపవాస దీక్ష విరమణ
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

