న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యాబ్యాంక్(కేవీబీ)..బేస్రేటుతోపాటు బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ బేస్రేటును పావు శాతం తగ్గించడంతో రేటు 7.75 శాతానికి తగ్గగా, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు స్వల్పంగా తగ్గించడంతో రేటు 12.75 శాతానికి దిగొచ్చింది. తగ్గించిన ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకిరానున్నట్లు పేర్కొంది. మరోవైపు, రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేవీబీ మాత్రం బేస్రేటును తగ్గించడం విశేషం.