హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వ్యాపారాన్ని ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తున్నది. తాజాగా కేరళలో అడుగుపెట్టింది. కన్నూర్‌లోని శ్రీ చంద్ హాస్పిటల్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందంలోభాగంగా కిమ్స్ నిర్వహణ, మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించనున్నది.
వచ్చే నెల 1 నుంచి కిమ్స్ అనుబంధ సంస్థ కిమ్స్ స్వస్థ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కిమ్స్ బీఎస్ఈకి సమాచారం అందించింది. 2020లో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో 189 పడకలు, ఆరు ఆపరేషన్ థియేటర్లు, ఒక్క క్యాథ్ లాబ్ ఉన్నాయి.