Kinetic-Zulu | మార్కెట్లోకి కైనెటిక్ ఈ-స్కూటర్ జులు.. సింగిల్ చార్జింగ్‌తో 104 కి.మీ ప్రయాణించొచ్చు.
Kinetic-Zulu | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic).. భారత్ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్ (E-scooter) స్కూటర్ జులు (Zulu) ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు.
Kinetic-Zulu | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic).. భారత్ మార్కెట్లో న్యూ ఎలక్ట్రిక్ (E-scooter) స్కూటర్ జులు (Zulu) ఆవిష్కరించింది. దీని ధర రూ.94,900 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించారు. దీనికి ఫేమ్-2 సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. ఓలా ఎస్1 (Ola S1) స్కూటర్లతో పోటీ పడుతుంది. వచ్చేనెల నుంచి ఈ-స్కూటర్ల డెలివరీ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. కైనెటిక్ నుంచి మార్కెట్లోకి వచ్చిన నాలుగో ఎలక్ట్రిక్ స్కూటర్ జులు. ఇంతకుముందు జింగ్ హెచ్ హెచ్ఎస్, జింగ్ జూమ్, కైనెటిక్ గ్రీన్ ఫ్లెక్స్ స్కూటర్లు మార్కెట్లోకి ఎంటరయ్యాయి.
సింగిల్ చార్జింగ్‌తో 104 కి.మీ దూరం ప్రయాణిస్తుంది జులు (Zulu). ఇందులో 2.27 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఇన్‌స్టల్ చేస్తారు. ఇందులో 2.1 కిలోవాట్ల బీఎల్డీసీ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గరిష్టంగా గంటకు 60 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 15-యాంప్స్ సాకెట్‌తో అర్ధగంటలో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. రాత్రంతా చార్జింగ్కు వీలు కల్పించే ఆటో కటాఫ్ ఫీచర్‌తోపాటు రేర్‌లో చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో అత్యంత సేఫ్టీ, ఎఫిషియెంట్ థర్మల్ మేనేజ్మెంట్ ఆప్షన్ కావాలంటే మరో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటది.
ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్స్తోపాటు 10 అంగుళాల వీల్స్ ఉంటాయి. రీజనరేటివ్ బ్రేకింగ్‌కు స్కూటర్ మద్దతుగా ఉంటుంది. సింపుల్ ఎల్సీడీ యూనిట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్టోరేజీ స్పేస్ బిహైండ్ ఆప్రాన్ ఉంటాయి.
జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 1830 ఎంఎం పొడవు, 1135 ఎంఎం ఎత్తు, 715 ఎంఎం వెడల్పు ఉంటుంది. దీని బరువు 93 కిలోలు. ఈ స్కూటర్ పేలోడ్ కెపాసిటీ 150 కిలోలు. ఇది ఆరు కలర్ ఆప్షన్లు – పిక్సెల్ వైట్, ఇన్‌స్టా ఆరెంజ్, యూ-ట్యూబ్ రెడ్, బ్లాక్ ఎక్స్, ఎఫ్బీ బ్లూ, క్లౌడ్ గ్రే కలర్స్‌లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

