Kia Seltos | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ కీలక మైలురాయి నమోదు చేసింది. మిడ్ సైజ్ ఎస్యూవీ సెల్టోస్ విక్రయాల్లో గణనీయ మార్క్ రికార్డైంది. 2019 ఆగస్టులో మార్కెట్లోకి ఎంటరైన సెల్టోస్.. సేల్స్ ఐదు లక్షల మైలురాయిని దాటేసింది.
భారత్ మార్కెట్లో 3,64,115 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. సుమారు 100 దేశాల్లో 1,35,885 సెల్టోస్ కార్లు సేల్ అయ్యాయి. మిడిల్ ఈష్ట్, ఆఫ్రికా, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, మెక్సికో, ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్యూవీ కారుకు మంచి గిరాకీ లభించింది.
ఎగుమతులతోపాటు కియా ఇండియా నికర సేల్స్‌లో సెల్టోస్ వాటా 55 శాతం. 2023 తొలి త్రైమాసికంలోనే 27,159 యూనిట్లు అమ్ముడయ్యాయి. వచ్చే నెలలో 2023 కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, ఎంజీ ఆస్టర్ మోడల్ కార్లతో కియా సెల్టోస్ పోటీ పడుతుంది. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న హోండా ఎలివేట్ తోనూ గట్టి పోటీని ఎదుర్కోనున్నది. ఇక కియా సెల్టోస్ ధర రూ.10.89 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య పలుకుతుంది.