హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ర్టానికి చెందిన ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.275.62 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.244.60 కోట్ల కంటే ఇది 12.68 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.685.59 కోట్ల నుంచి రూ.736.10 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ జీవీ భాస్కర్ రావు తెలిపారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో మొక్కజొన్న విత్తనాల విక్రయాలపై ప్రభావం చూపాయన్నారు.