న్యూఢిల్లీ, జనవరి 19: సూపర్, ప్రీమి యం ప్యాకేజీల సబ్స్క్రిప్షన్ ధరలను జియోహాట్స్టార్ పెంచింది. అలాగే మొబైల్ యూజర్ల కోసం నెలవారీ ప్లాన్నూ పరిచయం చేసినట్టు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయాలు ఈ నెల 28 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, మొబైల్ వినియోగదారుల మంత్లీ ప్లాన్ రూ.79గా ఉన్నది. 3 నెలల ప్లాన్ రేటు రూ.149గా, ఏడాది ప్లాన్ రూ.499గా యథాతథంగానే ఉన్నాయి.
ఇక సూపర్ శ్రేణిలో కొత్తగా వచ్చిన నెలవారీ ప్లాన్ రేటు రూ.149గా ఉన్నది. అయితే 3 నెలల ప్లాన్ ధర రూ.299 నుంచి 349కి పెరిగింది. ఏడాది ధర రూ.899 నుంచి రూ.1,099కి ఎగిసింది. ప్రీమియంలో మంత్లీ ప్లాన్ రేటు రూ.299గానే ఉన్నది. కానీ 3 నెలలు, ఏడాదివి రూ.699, రూ.2, 199గా ఉన్నాయి. గతంలో రూ.499, 1,499గా ఉన్నాయి.