Jio Investments | సిలికాన్ వ్యాలీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న టెక్ స్టార్టప్ టూ ప్లాట్‌ఫామ్స్ ఇంక్ ( TWO ) లో 15 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో ప్రకటించింది. టూ ప్లాట్‌ఫామ్స్ సంస్థను ప్రణబ్ మిస్త్రీ స్థాపించారు. సంస్థలో 25 శాతం వాటాను జియో కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తున్నది. టూ అనేది ఆర్టిఫిషియల్ రియాల్టీ కంపెనీ. ఇంటరాక్టివ్ అండ్ ఇమ్మర్షనల్ ఏఐ ఎక్స్పీరియన్సెస్పై ఈ సంస్థ దృష్టి కేంద్రీకరించింది. టెక్ట్స్ అండ్ వాయిస్ తర్వాత ఏఐ.. విజువల్ అండ్ ఇంటరాక్టివ్పై టూ ప్లాట్‌ఫామ్స్ ఫోకస్ చేయబోతున్నది. రియల్‌టైం వాయిస్, వీడియో కాల్స్, డిజిటల్ హ్యూమన్స్, ఇమ్మర్షివ్ స్పేసెస్, లైఫ్‌లైక్ గేమింగ్ తదితర ఆప్షన్లను టూ ఆర్టిఫిషియల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చింది.
తాజాగా కన్జూమర్ అప్లికేషన్స్‌తోపాటు ఎంటర్టైన్మెంట్, గేమింగ్, రిటైల్, సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్నెస్ రంగాలకు ఇంటరాక్టివ్ ఏఐ టెక్నాలజీస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందించింది. ఏఐ, మెటావర్స్, మిక్స్డ్ రియాలిటీస్ వంటి డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీలను ఫాస్ట్‌ట్రాక్ అడాప్షన్ కోసం జియో, టూ పరస్పరం సహకరించుకోనున్నాయి.
జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ ఏఐ/ఎంఎల్, ఏఆర్, మెటావర్స్, వెబ్ 3.0 ఏరియాల్లో టూ ఫౌండింగ్ టీం శక్తి సామర్థ్యాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. ఇంటరాక్టివ్ ఏఐ, ఇమ్మర్సివ్ గేమింగ్, మెటావర్స్ ప్రాంతాల్లో న్యూ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ కోసం టుతో కలిసి ముందుకెళతామన్నారు. టు సీఈవో ప్రణబ్ మిస్త్రీ మాట్లాడుతూ భారత్‌లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో జియో ఫౌండేషన్ వేసిందన్నారు. కన్జూమర్స్, బిజినెస్‌ల్లో ఆర్టిఫిషియల్ రియాల్టీ అప్లికేషన్లను ప్రవేశపెట్టేందుకు జియోతో పార్టనర్ కావడానికి ఆసక్తిగా ఉన్నాం అని చెప్పారు.