Black Money @ Gujarat Company | గుజరాత్ కేంద్రంగా కెమికల్స్ తయారీ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ కంపెనీలో జరిపిన సోదాల్లో రూ.100 కోట్ల బ్లాక్ మనీ బయటపడింది. ఈ నెల 18వ తేదీన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో వాపి, సరిగ్రామ్లతోపాటు ముంబైల్లో 20కి పైగా ప్రదేశాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో దొరికిన పత్రాలు, డిజిటల్ డేటా, డైరీల్లో పేర్కొన్న సమాచారం ప్రకారం సదరు గ్రూప్ భారీ మొత్తంలో లెక్కలు చూపని ఆదాయం సంపాదించిందని ఆధారాలు లభించాయని సీబీడీటీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ గ్రూప్ అనుబంధంగా ఉన్న వివిధ సంస్థల ఆస్తులను జప్తు చేశామని తెలిపింది.
బోగస్ కొనుగోళ్ల ఇన్వాయిస్లు, సరుకుల బోగస్ డెలివరీ, బోగస్ జీఎస్టీ క్రెడిట్, బోగస్ కమిషన్ ఖర్చులు చూపి ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని వివరించింది. స్థిరాస్తుల లావాదేవీల్లో సంపాదించిన సొమ్ముకు లెక్కలు చూపలేదని తెలిపింది.
స్థిరాస్తుల్లో పెట్టుబడులు, క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన పత్రాలు, నగదు రుణాల పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రూప్‌కు చెందిన 16 బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. రూ.2.5 కోట్ల నగదు, రూ. కోటి విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు జప్తు చేశారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా లభించిన ప్రాథమిక ఆధారాల మేరకు బ్లాక్ మనీ మొత్తం విలువ రూ.100 కోట్లు ఉండవచ్చునని సీబీడీటీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!