టెకీలకు బంపర్ బొనాంజా : క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపు, అదనపు బోనస్‌లు!

న్యూఢిల్లీ : కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగుల వలసల రేటు అత్యధికంగా ఉండటంతో నైపుణ్యాలు కలిగిన టెకీలను కాపాడుకునేందుకు కంపెనీలు టాప్ పెర్ఫామర్స్‌కు నజరానాలు ప్రకటిస్తున్నాయి. క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపులు, ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు, ఉన్నత విద్య కోసం ప్రోత్సహకాలు వంటి పలు ఆఫర్లతో ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి.
కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా స్టీల్, ఆర్పీజీ గ్రూప్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు కీలక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికి అనూహ్యమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ఏడాది భారత్‌లో 66 శాతం మంది ఉద్యోగులు తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం నుంచి మార్పు కోరుతున్నారని మైక్రోసాఫ్ట్ చేపట్టిన సర్వే నివేదిక పేర్కొంది. భారత్‌లో ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ సగటున ఉద్యోగుల నిష్క్రమణ రేటు దశాబ్ధంలోనే గరిష్టంగా 20 శాతం ఉందని ఏఒన్ ఇండియా వేతన పెంపు సర్వే సైతం వెల్లడించింది.
ఉద్యోగుల వలసలను నిరోధించేందుకు పుణేకు చెందిన పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వార్షిక వేతన పెంపులతో పాటు ఆయా ప్రాజెక్టులకు కీలకమైన ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేపట్టేందుకు టీం లీడర్స్ కోసం వార్షిక కోటా కింద కొంత మొత్తాన్ని కేటాయించినట్టు చెబుతున్నారు. కీలక ప్రాజెక్టుల్లో నైపుణ్యాలతో కూడిన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికి అదనపు బోనస్‌ను అందిస్తున్నామని పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

