iQoo Z9 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. బడ్జె్ట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి వస్తున్న ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14తో వస్తున్నది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 6.57 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కూడా ఉంటాయి. ఏఐ ఫీచర్లతో కూడిన ఫోటో ఎడిటింగ్ ఆప్షన్లు కూడా జత చేశారు.
ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ వై-ఫై 5, బ్లూటూత్ 5.4, టైప్ సీ యూఎస్బీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది. ఇంకా యాక్సెలరో మీటర్, ఆంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్ వంటి సెన్సర్లు ఉన్నాయి. 15వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ జత చేశారు.
ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499లకు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి, ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేసిన వారికి రూ.500 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఈఫర్ ఈ నెలాఖరు వరకూ ఉంటుంది. ఈ నెల 20 నుంచి ఐక్యూ జడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite) ఫోన్ విక్రయాలు మొదలవుతాయి. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ తోపాటు ఐక్యూ ఈ స్టోర్, ప్రధాన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.