iQoo Neo 9 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. ఐక్యూ నియో9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ -14 బేస్డ్ ఫన్ టక్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999లకు, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.39,999లకు లభిస్తుంది. కాంక్వార్ బ్లాక్, ఫెర్రీ రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్‌ల్లో సేల్స్ ప్రారంభం అవుతాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.2000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది. ఈ నెల 26 వరకూ బుక్ చేసుకున్నా, కొనుగోలు చేసినా ప్రమోషన్ డిస్కౌంట్‌గా మరో రూ.1000 ధర తగ్గుతుంది. ఇక 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ వచ్చేనెల 21 నుంచి రూ.35,999లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ మీద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తుంది. గేమింగ్ కోసం 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.78 అంగుళాల 1.5 కే (1260×2800 పిక్సెల్స్) ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ 1/1.49 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ ఓమ్నీ విజన్ ఓవీ08డీ10 సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా విత్ శాంసంగ్ ఎస్5కే3పీఎస్పీ04-ఎఫ్జీఎక్స్ 9 సెన్సర్ కెమెరా ఉంటుంది.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. యాక్సెలరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ సెన్సర్, గైరో స్కోప్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్ర్ ఉంటుంది. ఇన్ ఫ్రా రెడ్ బ్లాస్టర్ ద్వారా వివిధ భాగాలను కంట్రోల్ చేయొచ్చు.