iQoo Neo 7 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo) తన నియో 7 ప్రో (iQoo Neo 7 Pro) ఫోన్ భారత్ లో ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే నెల నాలుగో తేదీన భారత్ మార్కెట్లోకి వచ్చేస్తున్నది. ఆరెంజ్ కలర్ ఆప్షన్ తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది.
అంతే కాదు.. ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ కూడా జత చేస్తారు. చైనాలో విడుదల చేసిన నియో 7 రేసింగ్ ( Neo 7 Racing Edition) ఫోన్ కు రీబ్యాడ్జి చేసి ఐక్యూ నియో 7 ప్రోగా తీసుకొస్తున్నారని సమాచారం. నియో 7 ప్రో ఫోన్.. వన్ ప్లస్ 11ఆర్, వివో వీ 27 ప్రో, నథింగ్ ఫోన్ (2) ఫోన్లతో పోటీ పడనున్నదని తెలుస్తున్నది.
అధికారికంగా బ్యాటరీ కెపాసిటీ తెలుపకున్నా 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ ఫుల్ హెచ్డీ + రిజొల్యూషన్, సపోర్ట్ ఫర్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఐక్యూ నియో 7 ప్రో ఫోన్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీల కోసం 16 -మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి. భారత్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.38 వేల నుంచి రూ.42 వేల మధ్య పలుకుతుందని తెలుస్తున్నది.