IPhone 16 : యాపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఈ ఏడాది చివరిలో న్యూ వర్టికల్ అలైన్డ్ కెమెరా లేఅవుట్, యాక్షన్ బటన్ వంటి డిజైన్ మార్పులతో రానున్నాయి. ఇక యాపిల్ తన నెక్ట్స్ ఐఫోన్ మోడల్స్‌లో మరో రెండు అడిషనల్ కలర్ ఆప్షన్స్‌తో ముందుకొస్తోందని టెక్ నిపుణులు లేటెస్ట్ లీక్‌లో వెల్లడించారు.
ఇక టిప్‌స్టర్ ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ అప్‌కమింగ్ ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్, వైట్, యల్లో కలర్ ఆప్షన్స్‌లో రానున్నాయని అంచనా వేసింది. వీటిలో పర్పుల్, వైట్ ఆప్షన్స్ నూతనంగా జోడించనుండగా, మిగిలిన కలర్స్ స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడల్స్. ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కస్టమర్ల ముందుకు రావచ్చని భావిస్తున్నారు.
న్యూ సిరీస్ ఫోన్ల లాంఛ్‌కు ముందు యాపిల్ జూన్ 10 నుంచి ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 ఈవెంట్ వేదికగా ఐఓఎస్ 18, మ్యాక్ఓఎస్ 15, ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్లో భాగంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్న న్యూ సాఫ్ట్వేర్ ఫీచర్స్‌ను ప్రదర్శించనుంది.
Read More :
Harish Rao | వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు జ్యోతిబా ఫూలే: హరీశ్ రావు