iPhone 15 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 15 ఫోన్‌పై వాలంటైన్స్ డే సందర్భంగా బంపరాఫర్ అందిస్తున్నది. ఐ-ఫోన్ 15 ఫోన్‌తోపాటు ఐ-ఫోన్ 15 ప్లస్, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్లనూ ఆవిష్కరించింది. ఒక ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్లు మూడు స్టోరేజీ ఆప్షన్లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజీ కెపాసిటీలతో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్ సెట్, ఐఓఎస్ 17 ఔటాఫ్ ది బాక్స్ వర్షన్‌పై పని చేస్తున్న ఐ-ఫోన్ 15పై వాలంటైన్స్ డే సందర్భంగా ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్ కార్ట్ ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 15 వరకూ డిస్కౌంట్ ధర ప్రకటించింది. ఐ-ఫోన్ 15 ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.79,900, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.89,900, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,09,900లకు లభిస్తున్నాయి.
వాలంటైన్స్ డే ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్.. ఐ-ఫోన్ 15 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ మీద రూ.12,901 డిస్కౌంట్‌తో రూ.66,999లకు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో రూ.2000 డిస్కౌంట్.. అంటే రూ.64,999లకే 128 జీబీ స్టోరేజీ ఐ-ఫోన్ 15 లభిస్తుంది. సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు అదనంగా 10 శాతం రూ.1,500 వరకు రాయితీ అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు అత్యధికంగా రూ.3,300 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ఐ-ఫోన్ 15 ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓలెడ్ డిస్ ప్లే విత్ 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, సిరామిక్స్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది. డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్లో 48-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 12-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ చేస్తే 26 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం లభిస్తుంది.