iPhone 13 | అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 13 ధర ఎంత తగ్గిందో తెలుసా..?!
iPhone 13 | అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీగా ఆఫర్లు అందిస్తున్నది. రూ.50 వేల లోపు ధరకే అందుబాటులోకి రానున్నది.
iPhone 13 | మరో 15 రోజుల్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్-2024 ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఐ-ఫోన్ 13పై అమెజాన్ భారీగా ధర తగ్గిస్తోంది. 2021లో మార్కెట్లోకి ఎంటరైన ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.50 వేల దిగువకే కస్టమర్లకు అందిస్తోంది అమెజాన్. ఈ నెల 12 అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ ప్రారంభం అవుతాయి. అటుపై ఈ నెల 13 మధ్యాహ్నం నుంచి కస్టమర్లందరికీ ఆఫర్లు వర్తిస్తాయి.
అమెజాన్ ద్వారా కస్టమర్లు రూ.49,999లకే ఐ-ఫోన్ 13 కొనుగోలు చేయొచ్చు. వాస్తవంగా అమెజాన్‌లో ఐఫోన్ 13 ఫోన్ రూ.52,999 పలికింది. ఐఫోన్ 14, ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14ప్రో మోడల్, ఐ-ఫోన్ 14 ప్లస్ ఫోన్లపై ఆఫర్లు వస్తాయని భావిస్తున్నారు. ఎస్బీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.48,999లకు దిగి వస్తుంది. ఎక్స్చేంజ్ కింద రూ.22,500 (పాత ఫోన్ పరిస్థితిని బట్టి) వరకూ ధర తగ్గుతుందని అమెజాన్ తెలిపింది.
2021లో మార్కెట్లో ఆవిష్కరించిన ఐ-ఫోన్ 13 ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్ప్లే విత్ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఆపిల్ ఏ15 బయోనిక్ చిప్ కలిగి ఉంటుంది. తాజా వర్షన్ ఐఓఎస్ 12పై పని చేస్తుందీ ఫోన్. ఐ-ఫోన్ 13 డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఫేస్ ఐడీ సెన్సర్ కలిగి ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ కనెక్టివిటీ, లైటెనింగ్ పోర్ట్ ఫర్ 1చార్జింగ్ పెసిలీటి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

