iPhone-13 Discounts | ఆపిల్ ఐ-ఫోన్13 అంటే ఎవరికైనా ఇష్టమే.. కానీ ఈ ఫోన్ల ధరలు కాస్త కాస్ట్ లీ. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.69,990. కానీ ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.58,749లకే లభిస్తుంది. అంటే కస్టమర్లు రూ.11,151 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
అంతే కాదు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఐ-ఫోన్ 13 బుక్ చేసుకుంటే రూ.57,999లకే లభిస్తుంది. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ బుక్ చేసుకున్న వారికి ఫ్లిప్ కార్ట్ రూ.750 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.30 వేల వరకు ధర తగ్గించే అవకాశం ఉంది. అయితే, ఎక్స్చేంజ్ చేస్తున్న ఫోన్ పనితీరును బట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ మీద ఐ-ఫోన్13 కొనుగోలు చేసే వారికి ఇస్తున్న రాయితీ తాత్కాలికమా, దీర్ఘకాలంగా కొనసాగుతుందా? అన్న సంగతి తెలియదు గానీ.. ఐ-ఫోన్ ప్రేమికులకు మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.