Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ ఆరంభ సంబరాల్లో.. ముఖేశ్ – నీతా అంబానీ దంపతులు
Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) ప్రారంభోత్సవ సంబరాల్లో అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) దంపతులు పాల్గొన్నారు.
Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) ప్రారంభోత్సవ సంబరాల్లో అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani) దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఫిల్ టవర్ (Eiffel Tower) ముందు ఇద్దరూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, నీతా అంబానీ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. బుధవారం జరిగిన 142వ ఐవోసీ సెషన్లో నీతా అంబానీ 100 శాతం ఓటింగ్‌తో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికపై ఆమె స్పందిస్తూ ‘ఐవోసీ సభ్యురాలిగా తిరిగి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఐవోసీఏ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు సహచర సభ్యులకు కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ఎన్నిక నా వ్యక్తిగతం కాదు.. ప్రపంచ క్రీడా యవనికపై భారత్ క్రీడాభివృద్ధికి నిదర్శనం. ఈ సందర్భాన్ని ప్రతీ భారతీయునితో పంచుకోవాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సమాఖ్య (ఐవోఏ)తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్.. ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా ఇండియా హౌజ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అట్టహాసంగా ఒలింపిక్స్ ప్రారంభం
పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సీన్ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలైన ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్‌బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకుని పరిగెత్తగా..అతన్ని అనుసరిస్తూ కొంత మంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెరతీసినట్లు అయ్యింది. ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయెల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్‌పాస్ట్‌కు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
International Olympic Committee (IOC) member Nita Ambani and Industrialist Mukesh Ambani at the opening ceremony of the Paris 2024 Olympics at the iconic Eiffel Tower. pic.twitter.com/0jD7tT974B
— ANI (@ANI) July 27, 2024
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
Mamata Banerjee | మైక్ కట్.. నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన పశ్చిమబెంగాల్ సీఎం
Tihar Jail | తీహార్ జైలులో గొడవ.. ఇద్దరు ఖైదీలకు గాయాలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

