న్యూఢిల్లీ, మార్చి 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. తాజా అడ్వాన్సు పన్ను వసూళ్లతో కలుపుకొని, ఇప్పటివరకూ నికర వసూళ్లు 48 శాతం వృద్ధితో రూ.13.63 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇవి రూ.9.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొవిడ్ ముందస్తు సంవత్సరమైన 2019-20లో నమోదైన రూ.9.56 లక్షల కోట్లను సైతం మించడం గమనార్హం. మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 53 శాతం కార్పొరేట్ల నుంచి వసూలవగా, 48 శాతం వ్యక్తిగత ఆదాయపు పన్ను, షేర్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) ద్వారా సమకూరింది.