IT Recruitments | ఐటీ ఇంజినీర్లకు ఫుల్ జోష్.. 120% వేతనం హైక్ ఆఫర్లు
IT Recruitments | ఐటీ రంగంలో నియామకాలు పుంజుకున్నాయి. నైపుణ్యాన్ని బట్టి 120% వేతనం పెంపుకు ఐటీ దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి.

IT Recruitments | దేశంలోని అతిపెద్ద ఐటీ దిగ్గజాల్లో నూతన నియామకాలు ఊపందుకోనున్నాయి. నిపుణులను ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో అత్యంత ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన ప్యాకేజీని ప్రకటించాయి. అత్యంత నిపుణులైన ఐటీ ఇంజినీర్లకు అవసరమైతే 70-120 శాతం వేతనం పెంచేందుకు సిద్ధం అని సంకేతాలిచ్చాయి. గతంలో ఐటీ ఉద్యోగులు 10 నుంచి 30 శాతం శాలరీ హైక్ కోరుకునే వారు.
కరోనా టైంలో నియామకాలు తగ్గుముఖం పట్టడం ఐటీ కంపెనీలు తాజాగా దూకుడుగా నియామకాలు చేపట్టడానికి కారణంగా తెలుస్తోంది. కరోనా తొలి దశలో ఐటీ రంగంలో నియామకాలు కేవలం 50 శాతం మాత్రమే ఉన్నాయి. ఐటీ నిపుణులకు సుమారు 400 శాతం డిమాండ్ ఉందని ఇండీడ్ ఇండియా అనే జాబ్ సెర్చ్ పోర్టల్ నివేదించింది.
గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అప్లికేషన్ డైవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్ వంటి స్కిల్డ్ సాంకేతిక నిపుణుల పోస్టులకు 150-300 శాతం డిమాండ్ ఉంది.
కొంత కాలం పని చేసి మానేసిన మహిళా ప్రొఫెషనల్స్ నియామక డ్రైవ్ చేపట్టినట్లు ఇటీవల టీసీఎస్ ప్రకటించింది. ప్రతిభ, సామర్థ్యం ఎల్లవేళలా ఉంటాయి. అనుభవజ్ఞులైన మహిళా నిపుణులకు తిరిగి పనులు ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- IT Sector
- recruitments
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

