న్యూఢిల్లీ : డైనమిక్ ఐలండ్, హెచ్డీ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం వంటి ఐఫోన్ తరహా ఫీచర్లతో ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను (Infinix Smart 8HD) లాంఛ్ చేయనుంది. రూ. 10,000లోపు ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఇన్ఫినిక్స్ స్మార్ట్8హెచ్డీని డిసెంబర్ 8న లాంఛ్ చేస్తోంది. మేజిక్ రింగ్‌గా పిలిచే యూనిక్ ఫీచర్ కూడా ఈ ఫోన్లో ఆకట్టుకుటుంది.
స్మార్ట్ 7 సిరీస్ విజయవంతం కావడంతో దాని కొనసాగింపుగా మరిన్ని అప్గ్రేడ్లతో స్మార్ట్8హెచ్డీని కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు ఇన్ఫినిక్స్ కసరత్తు సాగించింది. మేజిక్ రింగ్ ఫీచర్ జోడించడంతో యూజర్లకు వెసులుబాటు కలుగుతుందని, ఈ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచర్ ఉండటం ఇదే తొలిసారని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఫేస్‌అన్‌లాక్, మేనేజింగ్ బ్యాక్‌గ్రౌండ్ కాల్స్, చార్జింగ్ యానిమేషన్స్ డిస్ప్లే, చార్జింగ్ అయిపోయే సమయంలో యూజర్లకు అలర్ట్ చేయవడం వంటి పలు ఫంక్షన్స్‌ను మేజిక్ రింగ్ ఫీచర్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫీచర్లు యూజర్లకు సౌలభ్యంగా ఉండటంతో ఈ హాట్ డివైజ్ ప్రత్యేకంగా నిలుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read More :