Infinix Hot 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ త్వరలో తీసుకు రానున్నది. ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ (Infinix Hot 30 5G) ఫోన్ వచ్చేవారం మార్కెట్లో ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉండొచ్చు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.
అరోరా బ్లూ, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తున్న ఇన్ ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ ఈ నెల 14న మార్కెట్లో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా సెన్సర్ తో కూడిన రెక్టాంగ్యులర్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల కోసం హోల్ పంచ్ డిస్ ప్లే కెమెరా ఉంటుంది.
6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐపీ53 రేటెడ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. చార్జింగ్ సామర్థ్యం వెలువడలేదు గానీ, 580 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో థాయిలాండ్లో ఇన్ఫినిక్స్ హాట్ 30 4జీ ఫోన్ ఆవిష్కరించారు. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. మీడియా టెక్ హేలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్, హోల్ పంచ్ డిస్ ప్లే హౌసింగ్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.