న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో లాభాలకు జెట్ఫ్యూయల్, రూపాయి పతనం సెగ తగిలింది. దీంతో గడిచిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,064 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,170 కోట్ల నుంచి రూ.13,019 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు రెండు రెట్లు పెరిగి రూ.6,344 కోట్ల నుంచి రూ.14,083 కోట్లకు పెరిగాయని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. వీటిలో విమాన ఇంధనం కోసం రూ.5,990 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కేటాయించిన రూ.1,215 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగాయి.