న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా టాప్-200 సెల్ఫ్-మేడ్ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిల్లేనియా 2025 జాబితాలో స్విగ్గీ సహ వ్యవస్థాపకులు, తెలుగువారైన శ్రీహర్ష మేజేటి, నందర్ రెడ్డి మెరిశారు. 5వ స్థానం సాధించారు. ఈ సంస్థ విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్నట్టు బుధవారం విడుదలైన నివేదికలో తేలింది. కాగా, తొలి స్థానంలో గురుగ్రామ్ ఫుడ్ డెలివరీ వేదిక వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నిలిచారు.
ఈయన కంపెనీ విలువ రూ.3.2 లక్షల కోట్లు. దీంతో డీ-మార్ట్ యజమాని దమానీ రెండో స్థానంలోకి పడిపోయారు. ఆయన వ్యాపారం విలువ రూ.3 లక్షల కోట్లు. అయితే ఇటీవల భారతీయ విమానయాన రంగాన్ని కుదిపేసిన ఇండిగో కంపెనీ వ్యవస్థాపకులు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ రూ.2.2 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. నాల్గో స్థానంలో రూ.1.1 లక్షల కోట్లతో మ్యాక్స్ హెల్త్‌కేర్ అధినేత అభయ్ సోయి ఉన్నారు.