Retail Inflation | గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరుకుని 4.91 శాతంగా నమోదైంది. ఇలా రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగడం వరుసగా ఐదోనెల. అంతే కూరగాయల ధరలు మండిపోవడం కూడా రిటైల్ ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయని నిపుణులు చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార వస్తువులే సగ భాగం ఉంటాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే గత నెలలో ఆహార ద్రవ్యోల్భణం 1.87 శాతం పెరిగింది. అక్టోబర్‌తో పోలిస్తే 0.85 శాతం ఎక్కువైంది.
గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ-కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) 4.29 శాతంగా నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో 5.54 శాతంగా రికార్డయిందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతం, అక్టోబర్‌లో 4.48 శాతంగా నమోదైంది.
ఆయిల్ అండ్ ఫ్యాట్స్‌లో 29.67 శాతం, ఇంధనం, విద్యుత్ రంగాల్లో 13.35 శాతం, రవాణా, కమ్యూనికేషన్ల రంగాల్లో 10.02 శాతం ద్రవ్యోల్బణం రికార్డైంది. ఇక గృహోపకరణ సరుకులు, సేవల విభాగంలో 6.41 శాతం దుస్తులు& పాదరక్షల విభాగంలో 7.94 శాతం, ఆల్కాహాలేతర పానీయాల్లో 9.65 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
వంట నూనెల ధరలు గతేడాదితో పోలిస్తే సుమారు 30 శాతం పెరిగాయి. రిటైల్ పెట్రోల్/డీజిల్ ధరలు 13.35 శాతం పెరిగాయి. అక్టోబర్‌తో పోలిస్తే 14.35 శాతం ఎక్కువయ్యాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంనాటికి ద్రవ్యోల్బణం ఐదు శాతానికి పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు.