Indian Rupee : అమెరికన్ డాలర్ (US dollar) తో పోల్చితే భారత రూపాయి (Indian rupee) వరుసగా మూడో సెషన్లోనూ బలపడింది. ఇవాళ (బుధవారం) 12 పైసలు మెరుగుపడి చివరికి 85.68 వద్ద ముగిసింది. విదేశీ నిధుల (Foreign funds) రాక పెరగడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే అమెరికా కరెన్సీని కొంత బలహీనపర్చింది. అమెరికా వివిధ దేశాలపై టారిఫ్‌లు విధించడం ఇండియన్ రూపీకి లాభం చేకూర్చిందని ఫారెక్స్ నిపుణులు (Farex experts) చెబుతున్నారు.
అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా రూపాయి బలోపేతం కావడానికి దోహదపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్లో ఇవాళ 85.66 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 85.50 గరిష్ఠ స్థాయిని తాకింది. అదేవిధంగా 85.72 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి 85.68 వద్ద సెటిల్ అయ్యింది. క్రితం రోజు అంటే మంగళవారం నాటి ముగింపుతో పోల్చుకుంటే 12 పైసలు మెరుగుపడింది.
మంగళవారం కూడా రూపాయి బలపడింది. 30 పైసలు మెరుగుపడి 85.80 వద్ద ముగిసింది. అంతముందు సెషన్లో అంటే శుక్రవారం నాటి సెషన్లో రూపాయి ఏకంగా 58 పైసలు మెరుగుపడింది.