విజ్క్ ఆన్ జి: వరుసగా రెండు పరాభవాల తర్వాత నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ తిరిగి పుంజుకున్నాడు. ఆరు, ఏడు రౌండ్లలో ఓటమి అనంతరం సోమవారం జరిగిన 8వ రౌండ్లో నల్లపావులతో ఆడిన అతడు..
41 ఎత్తుల్లో వ్లాదిమిర్ ఫెదోసీవ్ (స్లోవేనియా)ను ఓడించాడు. విజయంతో టోర్నీని ఆరంభించి తర్వాత డ్రాల బాట పట్టిన అర్జున్ ఇరిగేసి.. అరవింద్ చిదంబరమ్తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. ప్రజ్ఞానంద సైతం.. యాగిజ్ ఎర్డోగమస్తో గేమ్‌ను డ్రాగా ముగించాడు.