Ravi Ruia | ఇండియన్ బిలియనీర్ రవి రుయా లండన్‌లో 145 మిలియన్ల అమెరికా డాలర్ల (113 మిలియన్ల బ్రిటన్ పౌండ్లు – భారత కరెన్సీలో దాని విలువ రూ.1200 కోట్లు) విలువ చేసే లండన్ మాన్షన్ సొంతం చేసుకున్నారు. రష్యా ప్రాపర్టీ డీలర్ ఆండ్రేయ్ గొంచారెంకో నుంచి రవి రుయా కొనుగోలు చేశారు. బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో ఇటీవల జరిగిన అతిపెద్ద ఇండ్ల విక్రయాల డీల్ అని విశ్లేషకులు చెబుతారు.
రవిరుయా.. పేరొందిన పారిశ్రామికవేత్త.. ప్రముఖ ఇన్ఫ్రా వసతుల సంస్థ ఎస్సార్ గ్రూప్ సహా-వ్యవస్థపకులు. లండన్ నగరంలోని 150-పార్క్ రోడ్డు వద్ద హాన్ ఓవర్ లాడ్జి మాన్షన్‌ను రవిరుయా ఈ నెలలోనే సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ ఇంటి నుంచి రీజెంట్ పార్క్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ భవనం పూర్తి నిర్మాణంలో ఉందని, ఫ్యామిలీ ఆఫీసు కోసం ఆకర్షణీయ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడానికి వెసులుబాటుగా ఉంటుందని రుయా ఫ్యామిలీ ఆఫీసు అధికార ప్రతినిధి విలియం రెగో తెలిపారు.
రష్యా ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ అనుబంధ గాజ్ప్రొమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ సీఈఓ గొంచారెంకో రెండేండ్ల క్రితం కొనుగోలు చేశారు. 2012లో నాటి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రాజ్ కుమార్ బగ్రీ 120 మిలియన్ల పౌండ్లకు లీజ్‌కు తీసుకున్న ఈ భవనాన్ని రెండేండ్ల క్రితం గొంచారెకో కొనుగోలు చేశారని తెలుస్తున్నది.