Gold Recycling | బంగారం ధర ఎఫెక్ట్.. రీసైక్లింగ్‌కు ప్రియార్టీ.. అందులో మనది ఫోర్త్ ప్లేస్!
Gold Recycling | ప్రపంచవ్యాప్తంగా గతేడాది బంగారం రీసైక్లింగ్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని డబ్ల్యూజీసీ తెలిపింది.
Gold Recycling | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో మక్కువ. వీలైనంత మేరకు బంగారం ఆభరణాలు చేయించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, దేశీయ బంగారం అవసరాలకు పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. సుంకాల భారం ఎక్కువే.. అంతే కాదు వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు (క్యాడ్) పై ప్రభావం చూపుతుంది. పెట్టుబడికి ప్రత్యామ్నాయ మార్గమైన బంగారం రీ సైక్లింగ్‌ను ప్రోత్సహించే చర్యలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. 2021లో బంగారం రీసైక్లింగ్ చేసిన దేశాల్లో మనదేశం నాలుగో స్థానంలో నిలిచింది.
2021లో 75 టన్నుల బంగారం దేశీయంగా రీ సైక్లింగ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రీసైక్లింగ్ చేసిన బంగారంలో ఇది 6.5 శాతం అని ఇటీవల ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గత ఐదేండ్లలో పాత బంగారం నుంచి భారతదేశంలో సరఫరా అయిన బంగారం 11 శాతం. బంగారం ధర పైపైకి దూసుకెళ్లడంతో దాన్ని సొమ్ము చేసుకునేందుకు పలువురు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం గానీ.. కొత్త బంగారం కొనుగోళ్లకు బదులు పాత బంగారం రీ సైక్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని మెటల్స్ ఫోకస్ రీసెర్చ్‌లో తేలింది.

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి గురైనప్పుడు సామాన్యులు తమ రోజువారీ అవసరాల కోసం కూడా బంగారం విక్రయించేశారని డబ్ల్యూజీసీ వెల్లడించింది. గతేడాది బంగారం రీ సైక్లింగ్ 0.6 శాతం నుంచి 0.3 శాతానికి పడిపోయింది. ఒక శాతం బంగారం ధర పెరిగితే.. రీసైక్లింగ్ బంగారం పరిమాణం 0.6 శాతం పెరుగుతుంది. బంగారం ఆభరణాల కోసం ఒకశాతం గిరాకీ పెరిగితే రీ సైక్లింగ్ ఒకశాతం తగ్గిపోతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

