న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ టెలికాం రంగ పరికరాల తయారీ పరిశ్రమ.. ప్రపంచ ఎగుమతుల్లో ఇంకా దిగువ శ్రేణిలోనే కొట్టుమిట్టాడుతున్నది. వార్షిక ఎగుమతులు కేవలం 0.6-1 బిలియన్ డాలర్లుగా ఉంటే.. దిగుమతులు 4-5 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయి మరి. ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ తాజా అంచనాలు.. భారత్‌కున్న అవకాశాలను తేటతెల్లం చేశాయి. స్థానికంగా తయారీ పెరిగి, దిగుమతుల్ని తగ్గించుకుంటే.. 2035కల్లా 50 బిలియన్ డాలర్ల ఎగుమతి హబ్‌గా భారత్ మారగలదన్నది.
ప్రస్తుతం 25 బిలియన్ డాలర్లే. కాగా, 5జీ నెట్వర్క్, ఫైబర్ కనెక్టివిటీ, డాటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యూచర్ 6జీ టెక్నాలజీల విస్తరణ దిశగా ఆయా దేశాలు అడుగుపెడుతున్న నేపథ్యంలో భారత్‌లో డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మా ణం అవసరమన్నది. ప్రస్తుతం చైనా పరికరాల వినియోగంపై భారతీయ టెలికాం ఇండస్ట్రీ ఎక్కువగా ఆధారపడుతున్నదని, 4జీ, 5జీ యాంటెన్నాలు, సిగ్నల్ ప్రాసెసర్లు తదితర 80 శాతానికిపైగా కీలక టెలికాం కాంపోనెంట్స్ చైనా నుంచే వస్తున్నాయన్నది.