న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దేశీయ పారిశ్రామిక రంగం పడకేసింది. వరుసగా కొన్ని నెలలుగా దూసుకుపోతున్న తయారీ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా డిసెంబర్ నెలకుగాను పారిశ్రామిక వృద్ధి 4.3 శాతానికి పరిమితమైంది. నవంబర్లో నమోదైన 7.3 శాతంతో పోలిస్తే భారీగా తగ్గగా..ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన ఒక్క శాతంతో పోలిస్తే మాత్రం భారీగా పెరిగింది.
కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన సంవత్సరం చివరి నెలలో తయారీ రంగం కేవలం 2.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్నది. అంతకుముందు నెలలో 6.4 శాతంగా ఉన్నది.