హైదరాబాద్, నవంబర్ 7: రాష్ర్టానికి చెందిన ఐఎస్పీ, ఐటీ/ఐటీఈఎస్ సేవల సంస్థ నెట్లింక్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ రూ.4.71 కోట్ల ఆదాయాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2.39 కోట్ల ఆదాయంతో పోలిస్తే 100 శాతం పెరిగింది. అలాగే పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.37 లక్షల నుంచి రూ.1.34 కోట్లకు చేరుకున్నది.