
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గత నెల 31 తుది గడువు. కానీ చాలామంది ఐటీఆర్ ఫైల్ చేయలేకపోయారు. మీరు కూడా అందులో ఉన్నారా.. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. మార్చి 31లోగా లేట్ ఫీజుతో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. కాకపోతే నిర్దిష్ట గడువు దాటినందున లేట్ ఫీజు చెల్లించాలి..
ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు ఆదాయం పన్ను చట్టంలోని 139 (1), 234 ఏ సెక్షన్ల ప్రకారం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. కనుక బిల్డ్ ఐటీఆర్‌లు మార్చి 31 వరకు రూ.5000 ఫైన్‌తో దాఖలు చేయొచ్చు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు ఆదాయం రూ.5 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే రూ.1000 పెనాల్టీ చెల్లిస్తే సరి. ఒకవేళ రూ.2.50 లక్షల్లోపు ఆదాయం ఉంటే పెనాల్టీ లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
ఆలస్యంగానైనా (belated) ఐటీఆర్ ఫైల్ చేసి.. నోటీసు జారీ కాకుండా జాగ్రత్త పడొచ్చు. కానీ నిర్దిష్ట గడువు ప్రకారం డిసెంబర్ 31లోగా ఐటీఆర్‌లు దాఖలు చేయనందుకు ప్రతికూలతలు ఉన్నాయి. ఐటీ చట్టం ప్రకారం ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసినందుకు కొన్ని మినహాయింపులు వదులుకోవాల్సి వస్తుంది. ఆదాయం పన్ను చట్టంలోని 10ఏ, 10బీ సెక్షన్ల ప్రకారం పన్ను రాయితీలు వర్తించవు. ఇంకా ఇదే చట్టంలోని 80ఐఏ, 80ఐఏబీ, 80ఐసీ, 80ఐడీ, 80ఐఈ సెక్షన్ల కింద మినహాయింపులు పొందలేరు. 80ఐఏసీ, 80ఐబీఏ, 80జేజేఏ, 80ఎల్ఏ, 80పీ, 80పీఏ, 80క్యూక్యూబీ, 80ఆర్ఆర్బీ సెక్షన్ల కింద టాక్స్ డిడక్షన్‌తో బెనిఫిట్లు వదులుకోవాల్సి వస్తుంది.