న్యూఢిల్లీ, మే 7: ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. ఇప్పటికే ప్రీమియం పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోగ్య బీమా పాలసీదారులపై బీమా సంస్థలు మరింత భారం మోపాయి.
గడిచిన ఏడాదికాలంలో ఆరోగ్య బీమా ప్రీమియంను 25 శాతం వరకు పెంచాయి. ఈ విషయాన్ని లోకల్సర్కిల్ తాజాగా విడుదల చేసిన సర్వేలో పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 52 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.