Hyundai & Benz Recall | కార్లలోని వివిధ పరికరాల్లో లోపాల వల్ల దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ సుమారు 70 వేల కార్లు, వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంగతిని కేంద్ర రవాణాశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్స్సీయెంట్ క్యూజెడ్ హెవీ డ్యూటీ ట్రక్, కౌంటీబస్తోపాటు ఆరు మోడల్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆయా వాహనాల్లోని వివిధ పరికరాల్లో లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆల్టర్నేటివ్ పరికరంలో ఫాల్ట్ వల్ల పవర్ ఔటేజ్ సమస్య తలెత్తిందని హ్యుండాయ్ తెలిపింది.
హ్యుండాయ్తోపాటు మెర్సిడెజ్ బెంజ్ కూడా ఐదు మోడల్ వాహనాలను 438 యూనిట్లు రీకాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈక్యూఈ 350+, ఈక్యూఎస్ 450+ ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ వాహనాలను రీకాల్ చేస్తున్నది. తమ కార్లు, వాహనాల్లో ‘పింటిల్ హుక్’లో లోపం ఉన్నట్లు గుర్తించింది. ఈ మోడల్ కార్లు సొంతం చేసుకున్న కస్టమర్లు తమ దగ్గర్లోని సర్వీస్ సెంటర్లలో విడి భాగాలు మార్చుకోవాలని హ్యుండాయ్, మెర్సిడెజ్ బెంజ్ కోరాయి. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయబోమని పేర్కొన్నాయి.