Hyundai Ioniq 5 EV | కర్బన ఉద్గారాల నియంత్రణ.. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ ఎక్కువ అవుతున్నది. టాటా మోటార్స్, మారుతి సుజుకిలతోపాటు హ్యుండాయ్ సహా పలు ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. హ్యుండాయ్ ఇప్పటికే కోనా ఈవీ మార్కెట్లో ఉంది. తాజాగా, బుధవారం అయానిక్-5 ఈవీని ఆవిష్కరించింది. వచ్చేనెలలో గ్రేటర్ నొయిడాలో నిర్వహించే ఆటోషోలో ధర పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. దీని ధర రూ.45-50 లక్షల మధ్య ఉండొచ్చునని అంచనా. ఆసక్తిగల కస్టమర్లు రూ.లక్ష చెల్లించి కార్లు బుక్ చేసుకోవచ్చు. `ఐయానిక్-5` కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
అంతర్జాతీయ మోడల్ అయానిక్-5 ఈవీ కారు బ్యాటరీ 58కేడబ్ల్యూహెచ్, 72.6 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీలతో వస్తున్నది. 385 కిలోమీటర్లు, 480 కిలోమీటర్ల దూరం ప్రయాణ సామర్థ్యం కలిగి ఉన్నాయి. రెండు బ్యాటరీ మోడల్స్ 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ (ఫోర్ వీల్ డ్రైవ్) ఆప్షన్లలో లభిస్తుంది. గరిష్టంగా గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 6.1 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్‌తో దూసుకెళ్లనున్నది. అంతే కారు కారు 4635 మిల్లీ మీటర్ల వెడల్పు, 1890 మిల్లీ మీటర్ల వైడ్. 1605 మిల్లీ మీటర్ల పొడవుతోపాటు 3000 మిల్లీ మీటర్ల వీల్ బేస్ కలిగి ఉంటుంది.
హ్యుండాయ్ ఐయానిక్-5 ఈవీ కారు 350కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్‌తో 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జి చేసుకోవచ్చు. ఈ కారులో 12.3 అంగుళాల హెచ్డీ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ సామర్థ్యం, హెడ్అప్ డిస్ప్లే, లెదర్ సీట్స్, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఇంకా స్పోర్ట్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఫీచర్లు జత చేశారు.
స్మార్ట్ సెన్స్ లెవెల్ 2 అడాస్ సామర్థ్యం, లేన్ కీన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ తదితర సేఫ్టీ ఫీచర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఐయానిక్-5లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వర్చువల్ ఇంజిన్ సౌండ్, ఫోర్ డిస్క్ బ్రేక్‌లు జత కలిశాయి.