Grand i10 | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశీయ మార్కెట్‌కు కార్పొరేట్ ఎడిషన్‌గా గ్రాండ్ ఐ10 మాడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. పాత మాడల్‌తో పోలిస్తే నయా మాడల్‌ను లగ్జరీ లుక్‌తో తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు రకాల్లో లభించనున్న ఈ మాడళ్లలో 1.21 కప్పా పెట్రోల్ 5 ఎంటీ వెర్షన్ రూ.6,93,200గాను, స్మార్ట్ ఆటో ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ. 7,57,900గా నిర్ణయించింది.
భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా టైర్-ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్-బెల్ట్ రిమైండర్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ డోర్ లాకింగ్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..దేశీయ యువతను లక్ష్యంగా చేసుకొని ఈ కార్పొరేట్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, ఇప్పటికే నాలుగు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయన్నారు.