న్యూఢిల్లీ, మార్చి 12: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్..మార్కెట్లోకి మరో నూతన మాడల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే లక్షలాది మంది క్రెటా కస్టమర్లను ఆకట్టుకున్న సంస్థ..తాజాగా నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రెటా ఎన్ లైన్ పేరుతో వి డుదల చేసిన ఈ మాడల్ 1.5 లీటర్ టర్బో జీడీఐ ఇంజిన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించింది. 8.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ 160 పీఎస్‌ల శక్తినివ్వనున్నది. 1,482 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన ఈ మాడల్ లీటర్ పెట్రోల్‌కు 18.2 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా క్రెటాను భద్రతకు పెద్దపీట వేసిన సంస్థ..42 స్టాండర్డ్ సెఫ్టీ ఫీచర్స్‌తోపాటు 70 అడ్వాన్స్ ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
ధరలు: