Hyundai Creta 2024 facelift | హ్యుండాయ్ క్రెటా 2024 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. రిలీజయ్యేది ఈ తేదీ.. యువతరానికి ఆకర్షణీయ ఎస్యూవీ..!
Hyundai Creta 2024 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Creta Facelift) కారును ఈ నెల 16న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hyundai Creta 2024 facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Creta Facelift) కారును ఈ నెల 16న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే క్రెటా ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెటా ధర కంటే ఎక్కువే ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆసక్తి గల కార్ల ప్రేమికులు రూ.25 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.
తొలుత హ్యుండాయ్ మోటార్ ఇండియా తన క్రెటా కారును 2015 జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత ఎనిమిదేండ్లుగా దేశీయంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ ఎస్యూవీ కార్లలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ కారుగా క్రెటా నిలిచింది. న్యూ మోడల్ క్రెటా ఫేస్ లిఫ్ట్ కారు పాత మోడల్ కారులో డిజైన్ తోపాటు అడ్వాన్స్డ్ ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది. ఎస్యూవీ సెగ్మెంట్లో కస్టమర్లకు ఆకర్షణీయ ఆప్షన్‌గా నిలవనున్నది క్రెటా ఫేస్ లిఫ్ట్.
న్యూ రేడియేటర్ గ్రిల్, అప్ రైట్ హుడ్ డిజైన్‌తో కమాండింగ్ లుక్‌తో వస్తోంది. హరిజోన్ ఎల్ఈడీ పొజిషనింగ్ లాంప్, డీఆర్ఎల్స్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. కార్ల ప్రయాణాన్ని థ్రిల్లింగ్‌గా పరిగణించే వారికి అట్రాక్టివ్‌గా ఉంటుందీ మోడల్. ఇంటీరియర్‌గా అడ్వాన్స్ ఫీచర్లతో ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా హ్యుండాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ రూపుదిద్దుకుంటుంది.
న్యూ హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. వాటిల్లో ఒకటి స్పోర్టీ 1.5 లీటర్ల కప్పా టర్బో జీడీఐ పెట్రోల్, 1.5 లీటర్ల ఎంపీఐ పెట్రోల్, 1.5 లీటర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ వేరియంట్లతో వస్తున్నది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఐవీటీ (ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్ మిషన్), 7-స్పీడ్ డీసీటీ (డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. నూతన తరం కస్టమర్ల ఆకాంక్షలకు డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందీ కారు.
ఏడు వేరియంట్లు, సిక్స్ మోనో టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ క్రెటా ఫేస్ లిఫ్ట్. రోబస్ట్ ఎమరాల్డ్ పెరల్ (న్యూ), ఫియరీ రెడ్, రేంజర్ కాకీ, అబ్యాస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూప్ లో వన్ డ్యుయల్ టోన్ ఆప్షన్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

