Huawei Mate 60 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే (Huawei)` తాజాగా హువావే మేట్60 ప్రో ఫోన్.. చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారో వెల్లడించలేదు. గతేడాది తీసుకొచ్చిన మేట్ 50 ప్రో కొనసాగింపుగా ఆవిష్కరించిన హువావే మేట్ 60 ప్రో ఫోన్ శాటిలైట్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లే కూడా వుంటుంది. ఈ ఫోన్ 6.82 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. త్రీడీ టైం ఆఫ్ ఫ్లైట్ (టీఓఎఫ్) సెన్సార్, సెల్ఫీ కెమెరా ఉంటాయి.
హువావే మేట్ 60 ప్రో ఫోన్ 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్.. దాదాపు రూ.79,400 (6,999 చైనా యువాన్లు) పలుకుతుంది. 256 జీబీ అండ్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ల వివరాలు వెల్లడించలేదు. అకవా సై, సౌత్రన్ వాక్సీ పర్పుల్, వైట్ శాండ్ సిల్వర్, యదాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డ్యుయల్ సిమ్ ఆప్షన్ గల ఈ ఫోన్ హార్మోనీ ఓఎస్ 4.0 వర్షన్ పై పని చేస్తుంది. సెకండ్ జనరేషన్ కున్లున్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
సర్క్యులర్ కెమెరా ఐలాండ్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో హువావే మేట్ 60 ప్రో ఫోన్ వస్తుంది. ఈ ఫోన్లో వినియోగించే ప్రాసెసర్ వివరాలు వెల్లడించలేదు. సెల్యూలార్ నెట్ వర్క్ కనెక్టివిటీ లేకుండానే శాటిలైట్ కాలింగ్ సపోర్ట్ ఉంటుంది. 88 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.