Homes in Bengalore | ప్రతి ఒక్కరికి సొంతింటి కొనుగోలు అతిపెద్ద కల. చాలా మంది భారతీయులు సొంతింటి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిందే. పట్టన జనాభా పలు రెట్లు పెరుగుతున్న తరుణంలో బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ సిటీలో ఇల్లు కొనుగోలు చేయడం కాస్త కష్టమనే చెప్పాలి. బెంగళూరు నగరం ఐటీ సంస్థలకు పెట్టింది పేరు. పుష్కల ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్న చోటే ఇల్లు కొనుగోలు చేయడానికి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి రావడమే అతిపెద్ద అవరోధంగా ఉంది.
ఆస్తి విలువ అంచనా వేయడం కూడా కష్టమే. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖులు ఉన్నప్రాంతాలు.. వాటి సమీప కాలనీల్లో ధరలు అంచనా వేయలేం. రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల పై చిలుకు వరకు పలుకుతున్నాయి. బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇండ్ల రేట్లపై ఓ లుక్కేద్దాం..
బెంగళూరులోని చందాపురా ప్రాంతంలో సింగిల్ బెడ్రూమ్ (550-650 చదరపు అడుగులు) ధర రూ. 19.3-23.3 లక్షలు.
ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్-2 మొదలు గొట్టిగెరె, దేవనహల్లి, తూంకూర్ రోడ్డు ఏరియాల్లో (900 నుంచి 1200 చదరపు అడుగుల విస్తీర్ణం) డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రూ.34 లక్షల నుంచి రూ.46 లక్షల మధ్య పలుకుతున్నాయి.
కడుగొడి, కేఆర్‌పురం, ఎలహంక, తానిషాంద్రరోడ్డు, బనీర్గట్ట రోడ్డు ప్రాంతాల్లో (వెయ్యి నుంచి 1300 చదరపు అడుగుల విస్తీర్ణం) డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొనుగోలుకు రూ.51.4 లక్షల నుంచి రూ.67 లక్షలు ఖర్చు చేయాల్సిందే.
మరాఠహల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే (1100-1550 చదరపు అడుగుల విస్తీర్ణం) రూ.79.5-83.5 లక్షలు ఇన్వెస్ట్ చేయక తప్పదు.
కనకపురా రోడ్డు, తానిషాంద్రా రోడ్డు, జేపీ నగర్, బానశంకరి రోడ్డు ప్రాంతాల్లో త్రిపుల్ బెడ్రూమ్ (1400-2200 చదరపు అడుగుల విస్తీర్ణం) ఇండ్లు రూ.79.5 లక్షల నుంచి రూ.1.73 కోట్లు పలుకుతున్నాయి.