
వాహనదారులకు హోండా కార్స్ ఇండియా షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను పెంచేసింది.

సిటీ, అమేజ్ మోడల్‌కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు హోండా కంపెనీ ప్రకటించింది.

పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ప్రస్తుతం ఎక్స్ షోరూంలో అమేజ్ మోడల్ ధర రూ.6.99 లక్షలు మొదలుకొని రూ.9.60 లక్షల వరకు ఉన్నది.

హోండా సిటీ హైబ్రిడ్ మోడల్ ధర రూ.11.55 లక్షల నుంచి రూ.20.39 లక్షల వరకు లభిస్తున్నది.