న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి నయా బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతేడాదికిగాను సీబీ350, సీబీ350 హెచ్నెస్, సీబీ350ఆర్ఎస్ మోటర్‌సైకిళ్లను పరిచయంచేసింది. మూడురకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.2.10 లక్షలుగా నిర్ణయించింది. వీటిలో సీబీ350ఆర్ఎస్ మాడల్ రూ.2.10 లక్షలు కాగా, డీఎల్ఎక్స్ప్రో రూ.2.15 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు మోటర్‌సైకిళ్లు నూతన ఉద్గార మార్గదర్శకాలకు లోబడి తయారు చేసింది. 348.36 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్‌తో రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో స్పోర్ట్స్ బైలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా బైకులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
బ్యాటరీ ఎలక్ట్రిక్‌తో ఈవీ91 జట్టు
నూఢిల్లీ, ఏప్రిల్ 5: ఎలక్ట్రిక్ వాహనాల అగ్రిగేటర్ ఈవీ91 టెక్నాలజీస్..ఈవీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ‘బ్యాటరీ ఎలక్ట్రిక్’తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా దేశీయంగా ఈవీల వినిమయాన్ని పెంపొందించడానికి కృషి చేయడంతోపాటు కొనుగోలుదారులకు ఆర్థిక సేవలు, రెంటల్స్, దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ అందించనున్నాయి. భాగస్వామ్యులకు, కార్పొరేట్ క్లయింట్లకు, బీ2బీలకు 10 వేల ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో ఇప్పటి వరకు వెయ్యికి పైగా ఆర్డర్లు వచ్చాయి.