Home Loans | తక్కువ వడ్డీపై చౌక ఇంటి రుణాలిచ్చే బ్యాంకులివే..!
Home Loans | బ్యాంకులు, రుణ గ్రహీత సిబిల్ స్కోర్, ఆదాయం తదితర అంశాల ఆధారంగా ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు ఖరారవుతాయి.
Home Loans | ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. సొంతిల్లు అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గతంతో పోలిస్తే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇల్లు కొనుక్కోవడానికి, సొంత ఇండ్ల స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవడానికి రుణాలిస్తూ ఉంటాయి. అయితే, మెజారిటీ వాణిజ్య బ్యాంకులు.. ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగా ఫ్లోటింగ్ వడ్డీరేటుపై రుణాలివ్వడానికే మొగ్గు చూపుతుంటాయి.
రుణ గ్రహీత వయస్సు, విద్యార్హత, ఆదాయం, డిపెండెంట్ సభ్యులు, జీవిత భాగస్వామి ఆదాయం, మీ వ్రుత్తిలో స్థిరత్వం, ఆస్తులు, కొనుగోలు చేసే ఇంటి విలువ ఆధారంగా ఇంటి రుణం అర్హత ఖరారవుతుంది. మీరు ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసే బ్యాంకును బట్టి కూడా వడ్డీరేటు నిర్ణయం అవుతుంది.
ఇండ్ల రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలపై ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌కు అదనంగా మార్జిన్ ప్లస్ రిస్క్ ప్రీమియం వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇస్తుంది. కనుక మీ సిబిల్ స్కోర్, ఇతర అంశాల ఆధారంగా మీకు ఇచ్చే రుణంపై రిస్క్ ప్రీమియం మీద వడ్డీరేటు ఆధారపడి ఉంటుంది.
ఆగస్టు 18 నాటికి ఇండ్ల రుణాలపై చౌక వడ్డీరేట్లు వసూలు చేసే టాప్-10 బ్యాంకులు ఇవే..
బ్యాంకు పేరు ——— ఆర్ఎల్ఎల్ఆర్ — కనీస వడ్డీరేటు(శాతం) – గరిష్ట వడ్డీరేటు (శాతం)
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ——————————- 8.5% ————— 9.4%
ఇండియన్ బ్యాంక్ ———- 9.20 ————– 8.5% ————— 9.9%
పంజాబ్ నేషనల్ బ్యాంక్ —– 9.25 ————– 8.5% ————— 10.1%
ఇండస్ఇండ్ బ్యాంక్ —————————- 8.5% ————— 10.55%
బ్యాంక్ ఆఫ్ ఇండియా —— 9.25 ————— 8.5% ————— 10.6%
ఐడీబీఐ బ్యాంక్ ————- 9.10 ————— 8.55% ————– 10.75%
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర —– 9.30 ————– 8.6% —————- 10.3%
బ్యాంక్ ఆఫ్ బరోడా ———- 9.15 ————– 8.6% —————- 10.5%
ఎస్బీఐ టర్మ్ లోన్ ———– 8.75+సీఆర్పీ —– 8.7% ————— 9.65%
యూనియన్ బ్యాంక్ ——– 9.30 ————— 8.7% —————- 10.8%
ఈఎంఐలు ఇలా
వడ్డీ, రుణం అసలుమొత్తం కలిపి సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించాలి. మీకు ఇంటి రుణం పూర్తిగా పంపిణీ చేసిన తర్వాత ఈఎంఐ చెల్లింపులు ప్రారంభం అవుతాయి. ఫ్లోటింగ్ వడ్డీరేటు ఆప్షన్ ఎంచుకుంటే మార్కెట్లో వడ్డీరేట్లలో మార్పులను బట్టి ఈఎంఐలు ఖరారవుతాయి. ఒకవేళ వడ్డీరేట్లు పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది.. వడ్డీరేట్లు తగ్గితే ఈఎంఐ భారం తగ్గుతుంది.
ఇలా రుణంపై చార్జీలు
ఇంటి రుణం తీసుకున్న వారిపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వన్ టైం ఫీజు వసూలు చేస్తుంటాయి. ఈ వన్ టైం ఫీజు చెల్లింపు విడిగా చేయాలి. రుణం మొత్తం నుంచి బ్యాంకులు డిడక్ట్ చేసుకోవు. రుణ ప్రాసెసింగ్ లో బ్యాంకు ఖర్చులను రీయింబర్స్ చేయడానికి ఉద్దేశించిందే ఈ వన్ టైం ఫీజు. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని బ్యాంకులు ఇండ్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ ప్రకారం ఇంటి రుణ దరఖాస్తు ఆమోదానికి బ్యాంకులు వసూలు చేసే చార్జీలు ఇలా
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలు.
- ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ (కాంటాక్ట్ పాయింట్ వెరిఫికేషన్ సీవీ) చార్జీలు.
- వన్ టైం పోస్ట్ ఇన్స్పెక్షన్ చార్జీలు.
- లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్ చార్జీలు.
- వాల్యుయేషన్ కోసం వాల్యుయర్ చార్జీలు.
- బ్యూరో రిపోర్ట్ చార్జీలు.
- సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (సెర్సాయి చార్జీలు).
- ఐటీఆర్ వెరిఫికేషన్ చార్జీలు.
ముందస్తు రుణ చెల్లింపులకు అనుమతులుంటాయా?
ఆర్బీఐ హోంలోన్ మార్గదర్శకాల ప్రకారం ‘ఇంటి రుణం తీసుకున్న రుణ గ్రహీతలు ముందస్తుగా భారీ మొత్తం చెల్లింపులకు అనుమతి ఇస్తాయి. అయితే, అసలు మొత్తం రుణం ముందస్తు చెల్లింపుపై 2-3 శాతం రీపేమెంట్ పెనాల్టీ వసూలు చేస్తాయి. ఆదాయ వనరులు, ముందస్తు రుణం చెల్లింపులకు కారణాలను బట్టి రీపేమెంట్ పెనాల్టీ ఖరారవుతుంది. ఆయా రుణ గ్రహీతల కారణాలు, ఆదాయ మార్గాలను బట్టి అది వేర్వేరుగా నిర్ణయిస్తాయి బ్యాంకులు. ఒకవేళ మీరు వేరే బ్యాంకు నుంచి రుణం తీసుకుని ముందస్తు రుణ చెల్లింపులు చేస్తే సాధారణంగానే ప్రీపేమెంట్ పెనాల్టీ ఎక్కువగా ఉంటుంది. మీరు సొంతంగా సమకూర్చుకున్న వనరులతో ముందస్తు రుణ చెల్లింపులు చేస్తే రీపేమెంట్ పెనాల్టీ తక్కువగా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Ashutosh Dixit | ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతల స్వీకారం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

